హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ పికిల్‌బాల్(హెచ్పీఎల్) సర్వహంగులతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖలు లీగ్‌తో జతకట్టగా, తాజాగా టాలీవుడ్ దర్శకుడు దాస్యం తరుణ్‌భాస్కర్..హెచ్‌పీఎల్‌లో భాగం కాబోతున్నాడు.
ద రాప్టర్స్ జట్టుకు సహ యజమానిగా కౌశిక్ మానేపల్లి, దివ్య ప్రియాంకరెడ్డితో కలిసి తరుణ్ కొనసాగనున్నాడు. శుక్రవారం మొదలైన హెచ్పీఎల్ అభిమానులను అలరిస్తున్నది.