హైదరాబాద్, ఆట ప్రతినిధి: రానున్న రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. మంగళవారం సమావేశమైన కమిటీ చైర్మన్, సెలెక్టర్లు టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లకు(హైదరాబాద్, డెహ్రాడూన్) జట్టును ఎంపిక చేశారు.
15 మందితో కూడిన టీమ్‌కు యువ బ్యాటర్ తిలక్‌వర్మ కెప్టెన్‌గా, రాహుల్ సింగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు మిలింద్, తన్మయ్అగర్వాల్, రోహిత్రాయుడు, తనయ్ త్యాగరాజన్, అనికేత్‌రెడ్డి, నితేశ్, అభిరాత్, హిమతేజ, రాహుల్, రక్షణ్‌రెడ్డి, కార్తీకేయ, సరను నిశాంత్, ధీరజ్గౌడ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ జట్టుకు వినీత్ సక్సేనా చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.