లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం.. 115 రన్స్ తేడాతో కివీస్ చిత్తు
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవం తర్వాత.. ఇంగ్లండ్ తమ ‘బాజ్‌బాల్' రీసెట్‌ను విజయంతో ఘనంగా చాటుకుంది. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లిష్ టీమ్ 115 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
లండన్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవం తర్వాత.. ఇంగ్లండ్ తమ ‘బాజ్‌బాల్’ రీసెట్‌ను విజయంతో ఘనంగా చాటుకుంది. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లిష్ టీమ్ 115 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 254 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 55/5తో నాలుగో రోజు బరిలోకి దిగిన కివీస్ రెండు గంటల వ్యవధిలోనే మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయి 138 రన్స్‌కే ఆలౌటైంది.
ఆతిథ్య పేసర్ గస్ అట్కిన్సన్ (5/30) ఐదు వికెట్లతో చెలరేగాడు. డెవాన్ కాన్వే (41), గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్) ఏడో వికెట్‌కు 53 పరుగులు జోడించి కాస్త పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ఆతిథ్య బౌలర్ల దాటికి కివీస్ జట్టు లంచ్ సమయానికే కుప్పకూలింది. మొత్తం ఏడు వికెట్లు పడగొట్టిన పేసర్ ఓలీ రాబిన్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. రెండో టెస్ట్ మ్యాచ్ 17 నుంచి ది ఓవల్ మైదానంలో జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

