ముంబై: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే క్రికెట్ సిరీస్‌ను వెంటనే రద్దు చేయాలని హిందూ జాగరణ సమితి..బీసీసీఐని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ మేరకు సోమవారం హిందూ జాగరణ సమితి ప్రతినిధులు..బోర్డు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ కాపీని ప్రధాని నరేంద్రమోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కూడా పంపిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. భారత పర్యటనలో బంగ్లా టీమ్ రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మాజీ ప్రధాని షేక్ హసీన రాజీనామా తర్వాత బంగ్లాలో హిందువులపై ఊచకోత కొనసాగుతున్నది. మైనార్టీ హిందువులపై అమానుష రీతిలో దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా హిందూ జాగరణ సమితి నేతలు బీసీసీఐ వైఖరిని తప్పుబడుతున్నారు.