మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ ఆటగాడు రఫేల్ నాదల్‌తో పాటు రూడ్, జ్వెరెవ్, ఫ్రిట్జ్, జాబెర్ వంటి వాళ్లు ఇంటి బాటపట్టగా.. తాజాగా రెండు సార్లు రన్నరప్ డానియల్ మెద్వెదెవ్ కూడా నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో శుక్రవారం ఏడో సీడ్ మెద్వెదెవ్ 6-7 (7/9), 3-6, 6-7 (4/7)తో సెబాస్టియన్ కొర్డా (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
1998 ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గిన పెట్రా కొర్డా కుమారుడైన సెబాస్టియన్.. వరుస సెట్లలో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరి జొకోవిచ్, నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న మెద్వెదెవ్ ఈ సారి క్వార్టర్స్‌కు చేరకుండానే వెనుదిరిగాడు. ఇతర మ్యాచ్‌ల్లో సిట్సిపాస్, సిన్నెర్, ఆగర్, కచనోవ్ విజయాలు సాధించారు. మహిళల విభాగంలో అమెరికా యువ కెరటం కొకొ గాఫ్‌తో పాటు టాప్‌సీడ్ స్వియాటెక్, అజరెంకా, ఓస్టపెంకా, పెగులా, రైబాకినా, క్రెజికోవా ముందంజ వేశారు.