హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం స్థానిక హోటల్లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బోర్డు సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, క్రీడా మంత్రి శ్రీహరి పాల్గొన్నారు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో పోటీపడేలా చూస్తే ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, వైస్ చైర్పర్సన్ ఉపాసన, రవికాంత్‌రెడ్డి హాజరయ్యారు.