హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయస్థాయి జిమ్నాస్టిక్స్ ఈవెంట్ ‘జిమ్క్విన్ 2025’ రెండో ఎడిషన్లో హైదరాబాద్కు చెందిన ది గాడియం స్కూల్ విద్యార్థులు పతకాల పంట పండించారు. దేశంలోని 15 రాష్ర్టాలకు చెందిన వివిధ అకాడమీలు, పాఠశాలల నుంచి సుమారు 850 మంది యువ జిమ్నాస్ట్లు రిథమిక్, డాన్స్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్తో పాటు ఫ్లోర్ రొటీన్స్ గ్రూప్ అక్రోబాటిక్స్ ఈవెంట్లలో సత్తా చాటారు.
ఈ పోటీల్లో ఆతిథ్య గాడియం స్కూల్ విద్యార్థులు ఏకంగా 113 స్వర్ణాలు, 150 వెండి, 168 కాంస్య పతకాలతో కలిపి మొత్తంగా 431 పతకాలను గెలుచుకున్నారు. తమిళనాడులోని సేలం నుంచి వచ్చిన హై ైప్లెయర్స్.. 231 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. సోమవారం జరిగిన ముగింపు వేడుకల్లో గాడియం స్కూల్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ కె. కీర్తిరెడ్డి విజేతలకు బహుహతులు అందజేశారు.