హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండోర్(మధ్యప్రదేశ్) వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ లిఫ్టర్లు వైష్ణవి, ఉదయ్‌కిరణ్ సత్తాచాటారు.
శుక్రవారం జరిగిన మహిళల 84కిలోల విభాగంలో వైష్ణవి ఓవరాల్‌గా రజత పతకం దక్కించుకుంది. మరోవైపు పురుషుల 83కిలోల కేటగిరీలో ఉదయ్‌కుమార్ కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు.