లండన్: త్వరలో సొంతగడ్డపై భారత్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో విజయం కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారీ ప్రణాళికలను రచిస్తున్నది. ఇందులో భాగంగానే టీమ్ఇండియా బ్యాటర్లను నిలువరించేందుకు గాను ఆ జట్టు న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ టిమ్ సౌథీని స్పెషలిస్ట్ స్కిల్స్ కన్సల్టెంట్గా నియమించుకుంది.
సౌథీని ప్రత్యేకంగా భారత్తో సిరీస్ కోసమే ఎంపిక చేసినట్టు ఈసీబీ ఓ ప్రకటనలో తెలపడం గమనార్హం.