బెంగళూరు: రెండు రోజుల క్రితమే బెంగళూరు, అనంతపురం వేదికలుగా మొదలైన దులీప్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా ‘సీ’ వర్సెస్ ఇండియా ‘డీ’ మ్యాచ్ రెండు రోజులకే ఆసక్తికరంగా మారింది. రెండో రోజు 91/4 ఓవర్ నైట్ స్కోరు వద్ద ఆట ఆరంభించిన ఇండియా సీ.. మొదటి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇంద్రజీత్ (72) టాప్ స్కోరర్. యువ పేసర్ హర్షిత్ రాణా (4/33) నాలుగు వికెట్లతో రాణించగా అక్షర్ పటేల్, సారాన్ష్ జైన్ తలా రెండు వికెట్లతో చెలరేగారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా ‘డీ’.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 206 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ (54), పడిక్కల్ (56) రాణించారు.
202/7 వద్ద రెండో రోజు ఆటకు వచ్చిన ఆ జట్టుకు ముషీర్ ఖాన్ (181), నవ్‌దీప్ సైనీ (56) క్రీజులో నిలవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా ‘ఏ’.. ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 రన్స్ చేసింది. మయాంక్ (36), శుభ్‌మన్ గిల్ (25) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించినా సైనీ ఈ ఇద్దరినీ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు.