ఆ ట్రంప్ కార్డ్ ఇతడేనా!
భారత మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనాను అమితంగా ఆరాధించే.. ఆ కుర్రాడు అచ్చం తన రోల్ మోడల్లాగే పొట్టి ఫార్మాట్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లోనూ అవకాశం దక్కించుకున్న ఆ హైదరాబాదీ సీనియర్ ప్లేయర్ల కన్నా ఎక్కువ సంయమనం కనబర్చాడు.
భారత మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనాను అమితంగా ఆరాధించే.. ఆ కుర్రాడు అచ్చం తన రోల్ మోడల్లాగే పొట్టి ఫార్మాట్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లోనూ అవకాశం దక్కించుకున్న ఆ హైదరాబాదీ సీనియర్ ప్లేయర్ల కన్నా ఎక్కువ సంయమనం కనబర్చాడు. జట్టు అవసరాలను అర్థం చేసుకున్నవాడే గొప్ప ప్లేయర్ అవుతాడనే మాటలకు నిలువుటద్దంలా నిలిచిన ఆ యంగ్ గన్ మరెవరో కాదు. మన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మనే! ఈ సిరీస్‌లో వరుసగా 39, 51, 49 నాటౌట్, 7 నాటౌట్, 27 పరుగులు చేసిన తిలక్ భవిష్యత్తు స్టార్ అనే ముద్ర వేసుకున్నాడు. పిచ్, పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రత్యర్థి బౌలర్లు ఎంత దూకుడు మీదున్నా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని నిరూపించాడు. జట్టుకు అవసరమైనప్పుడు వేగంగా ఆడటంతో పాటు.. వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో క్రీజులో పాతుకుపోయి బాధ్యతను భూజానెత్తుకోవడం కూడా తనకు తెలుసని చూపించాడు. రెండో మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లంతా వెనుదిరిగిన సమయంలో ఎంతో పరిణతి చూపించిన ఈ హైదరాబాదీ.. అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి అర్ధశతకం నమోదు చేసుకున్నాడు.
మూడో మ్యాచ్‌లోనూ హాఫ్‌సెంచరీకి సమీపించినా.. హార్దిక్ పాండ్యా విన్నింగ్ సిక్సర్ బాదడంతో తిలక్‌కు ఆ అవకాశం దక్కలేదు. ఇక గత మ్యాచ్‌లో ఓపెనర్లు దుమ్మురేపడంతో తిలక్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశమే దక్కలేదు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన వర్మ.. 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. నిర్ణయాత్మక పోరులోనూ ఓపెనర్లు త్వరగానే ఔట్ కావడంతో మూడో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన తిలక్ అల్జారీ వేసిన ఆరో ఓవర్లో ఊచకోత కోశాడు. వరుసగా నాలుగు సార్లు బంతిని గీత దాటించి అదుర్స్ అనిపించుకున్నాడు. తిలక్‌లో వయసుకు మించిన పరిణతి ఉందని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనగా.. అతడిని వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. త్వరలో ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ ఉండటంతో మిడిలార్డర్లో బాధ్యతలు మోయగల తిలక్‌ను టీమ్ఇండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్ పెరుగుతున్నది. భారత జట్టులో ఒకటి నుంచి ఆరో స్థానం వరకు ఎడమ చేతి వాటం బ్యాటర్ లేకపోగా.. అవసరమైతే స్పిన్ బౌలింగ్ కూడా వేయగల తిలక్‌కు అవకాశం ఇస్తే మెగాటోర్నీలో అతడు ట్రంప్ కార్డ్ అవుతాడని వసీం జాఫర్ వంటి వాళ్లు కితాబిస్తున్నారు. మరి అరంగేట్ర టీ20 సిరీస్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ వన్డేల్లోనూ ఎంట్రీ ఇస్తాడా వేచి చూడాల్సిందే!
– నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

