హైదరాబాద్, ఆట ప్రతినిధి: దక్కన్ పాడెల్ లీగ్(డీపీఎల్) పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మహావీర్ స్టార్స్ ఆతిథ్యమిచ్చిన లీగ్‌లో ప్లేయర్లు తమదైన ప్రతిభతో ఆకట్టుకున్నారు. కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ ప్లేయర్ల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది.
టెన్నిస్‌ను పోలిన ఈ ఆటలో సింగిల్స్‌తో పాటు డబుల్స్ మేళవింపుగా ప్లేయర్లు తలపడ్డారు. కేవలం ఆటకే పరిమితం కాకుండా ప్రేక్షకులకు లైఫ్‌స్టయిల్‌ను పరిచయం చేయడం మారుతున్న శైలికి నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు.