టురిన్: ఈ ఏడాది టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో నంబర్ వన్ ర్యాంకుతో ముగించాలనుకున్న స్పెయిన్ కుర్రాడు కార్లొస్ అల్కరాజ్ అనుకున్నది సాధించాడు. ఇటలీలో జరుగుతున్న ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో అల్కరాజ్.. పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‌లో 6-4, 6-1తో లొరెంజొ ముసెట్టి(ఇటలీ)ని ఓడించడం ద్వారా ఈ ర్యాంకును దక్కించుకున్నాడు.
ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సిన్నర్ టైటిల్ దిశగా దూసుకుపోతున్నా అల్కరాజ్కు మూడు విజయాలు అవసరం ఉండగా మూడింటినీ గెలుచుకుని అగ్రస్థానం సాధించాడు.