BFI | బరేలి: ప్రపంచ బాక్సింగ్ కొత్త తీసుకొచ్చిన బరువు విభాగాలను భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) అమలు చేయబోతున్నది. జాతీయ పురుషుల టోర్నీ ద్వారా కొత్త కేటగిరీలతో పోటీలను నిర్వహిస్తున్నది. గతంలో ఉన్న 13 విభాగాలను వరల్డ్ బాక్సింగ్ పదింటికి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో కొత్త బరువు విభాగాలు 50కి(ఫ్లై వెయిట్), 55కి(బాటమ్వెయిట్), 60కి(లైట్‌వెయిట్), 65కి(వెల్టర్‌వెయిట్), 70కి(లైట్ మిడిల్‌వెయిట్), 75కి(మిడిల్‌వెయిట్), 80కి(లైట్ హెవీవెయిట్), 85కి(క్రూజర్వెయిట్), 90కి(హెవీ వెయిట్), 90+కి(సూపర్ హెవీవెయిట్)గా ఉన్నాయి.
వీటిలో ఆరు 55కి, 60కి, 65కి, 70కి, 80కి, 90కిలను ఒలింపిక్ కేటగిరీలుగా పేర్కొన్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) గుర్తింపు కోల్పోయిన తర్వాత గత ఎప్రిల్లో వరల్డ్ బాక్సింగ్ కొత్తగా మొదలైంది. ఇప్పటికే 60 మంది సభ్యుల మద్దతు కూడగట్టిన వరల్డ్ బాక్సింగ్..ఐవోసీ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నది.