BCCI | న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కాసుల పంట పండనుంది. రానున్న ఐదేండ్ల (2023-28) కాలానికి గాను ప్రసార హక్కుల కోసం బీసీసీఐ బిడ్డింగ్‌కు ఆహ్వానించింది. ఈ నెల 25 దరఖాస్తులకు ఆఖరి తేదీగా ప్రకటించిన బీసీసీఐ వేర్వేరుగా ప్రసార హక్కులను విక్రయించనుంది. ఐదేండ్ల కాలంలో స్వదేశంలో భారత్ మొత్తం 88 మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తంగా వేర్వే రు బిడ్ల ద్వారా దాదాపు రూ.8200 కోట్ల ఆదాయాన్ని బీసీసీఐ ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి.