Ranji Trophy | ముంబై: దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక రంజీ సీజన్‌ను ఇకనుంచి రెండు దశలుగా నిర్వహించనున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. 2024-25 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇంకా వెలువడనప్పటికీ రంజీ ట్రోఫీని రెండు దశల్లో ఆడించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో.. ‘దులీప్ ట్రోఫీతో సీజన్ మొదలవుతుంది.
ఆ తర్వాత ఇరానీ కప్ జరుగనుంది. అనంతరం రంజీ ట్రోఫీ లో భాగంగా ప్రతి జట్టు తమ తొలి ఐదు లీగ్ గేమ్స్‌ను ఆడతాయి. అవి ముగిశాక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీ ఉంటుంది. చివర్లో మళ్లీ రంజీ రెండో దశను నిర్వహించేందుకు ప్రతిపాదించాం’ అని పేర్కొన్నాడు. దీని కి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. సీకే నా యుడు ట్రోఫీ లో టాస్‌ను ఉపయోగించకుండా పర్యాటక జట్టు అభీష్టం మేరకు మ్యాచ్‌లను నిర్వహించనున్నట్టు ప్రతిపాదించింది.