Golf League | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్లో 16 జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్నది. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో శనివారం 3వ రౌండ్ ముగిసే సరికి ఆటమ్ చార్జర్స్ 532 పాయింట్లతో ఓవరాల్గా అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
టీమ్ దాసోస్(521), వ్యాలీ వారియర్స్(519) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మూడో రౌండ్లో ఎమ్వైకే స్ట్రైకర్స్ అగ్రస్థానం దక్కించుకుంది.