మెల్బోర్న్: ఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. యాషెస్‌లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో ఆర్చర్ యాషెస్ నుంచి తప్పుకున్నట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి.
ఈ యాషెస్‌లో ఆర్చర్ 80 ఓవర్లు బౌలింగ్ చేసి 9 వికెట్లు పడగొట్టాడు. ఆర్చర్ స్థానాన్ని అట్కిన్సన్ భర్తీ చేయనున్నాడు. యాషెస్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్న ఒలీ పోప్‌ను బాక్సింగ్ టెస్ట్ నుంచి తప్పించిన ఇంగ్లండ్.. జాకబ్ బెథెల్‌ను తుది జట్టులోకి తీసుకుంది.