Monsoon Regatta | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్, ద యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి హుసేన్సాగర్ వేదికగా 15వ ‘మాన్సూన్ రెగట్టా’ పోటీలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 140 మంది సెయిలర్లు ఈ పోటీలలో పాల్గొననున్నారు.
ఈ ఏడాది అండర్-18లో కొత్తగా ఐఎల్సీఎ4, 29ఈఆర్, ఇంటర్నేషనల్ 420 విభాగాలను చేర్చినట్టు నిర్వాహకులు తెలిపారు. అండర్-16లో తెలంగాణ అమ్మాయి కొమరవెల్లి దీక్షిత టాప్‌సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈనెల 20న పోటీలు ముగుస్తాయి.