కొత్తపల్లి: కరీంనగర్లో 10వ రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయి. జిల్లా యోగా సంఘం అధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సంఘం, మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో వీటిని నిర్వహిస్తున్నామని రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ రవీందర్ సింగ్ తెలిపారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 15 జిల్లాల నుంచి 700 మంది పాల్గొంటున్నారని.. 8 నుంచి 45 ఏండ్ల వయసు విభాగాల్లో రాణించినవాళ్లను గువాహటిలో నవంబర్ 23న జరిగే జాతీయ పోటీలకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంత రెడ్డి, యోగా సంఘం కార్యదర్శి నాగిరెడ్డి సిద్దారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.