మ్యాచ్ ముగిశాక కామెంటేటర్లు గిల్‌క్రిస్ట్, రవిశాస్త్రితో రోహిత్, కోహ్లీ మాట్లాడుతూ.. తమకు ఆస్ట్రేలియాలో ఎన్నో అనుభూతులు ఉన్నాయని, ఇక్కడ ఆడటం తమకు చాలా ఇష్టమని అన్నారు. కంగారూల గడ్డపై బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తామని చెప్పిన ఈ ద్వయం.. మళ్లీ తామిద్దరం ఇక్కడకు వస్తామో లేదో? తెలియదని అన్న విషయాన్ని భారంగా చెప్పింది.
ఈ సందర్భంగా వాళ్లిద్దరూ ఇన్నాళ్లూ తమకు మద్దతునిచ్చిన ఆస్ట్రేలియా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా రోకో మళ్లీ నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్‌తో అభిమానుల ముందుకు రానుంది.