బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ బరిలో ఉన్న షట్లర్లు తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతంగా దాటారు. మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా.. రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.
కానీ పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లైర్లెన లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్ మాత్రం మొదటి రౌండ్‌కే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ సైతం తొలి రౌండ్‌కే వెనుదిరిగింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ ద్వయం రెండో రౌండ్‌కు చేరింది.