ఓవల్: ఇండ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియాపై ప్రశంసలు కురుస్తున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. హై టెన్షన్ పుట్టించిన ఆఖరి టెస్టులో గిల్ సేన కేవలం ఆరు రన్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై సచిన్ కామెంట్ చేస్తూ.. టెస్టు క్రికెట్.. గూస్బంప్స్ తెప్పించిందన్నారు. సిరీస్‌ను 2-2తో సమం చేయడం అద్భుతమన్నారు. సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను సచిన్ మెచ్చుకున్నారు. ప్లేయర్ల పర్ఫారెన్స్కు 10-10 మార్క్ వేశారు సచిన్. ఇండియాకు చెందిన సూపర్‌మెన్.. సూపర్ విక్టరీ కొట్టినట్లు తన ఎక్స్‌లో రియాక్ట్ అయ్యారు.
Test cricket… absolute goosebumps.
Series 2–2, Performance 10/10!SUPERMEN from INDIA! What a Win. 💙🇮🇳🏏 pic.twitter.com/ORm1EVcbRH
— Sachin Tendulkar (@sachin_rt) August 4, 2025
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అవుతూ.. టీమిండియా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిందన్నాడు. టెస్టు క్రికెట్ ఉత్తమ ఫార్మాట్ అని, సభ్యులందరికీ అతను కంగ్రాట్స్ తెలిపాడు. సిరాజ్ రాణించిన తీరును సౌరవ్ మెచ్చుకున్నాడు. మ్యాచ్‌ను వీక్షించడం ఆనందంగా ఉందన్నాడు. ప్రసిద్ధ్, ఆకాశ్‌దీప్, జైస్వాల్‌ను కూడా అతను మెచ్చుకున్నాడు.
Fantastic from Team India . Test cricket ,best format by far..congratulations to all members and coaches led by the fantastic shubman gill..Siraj has never let this team down any part of the world..such a treat to watch .well done prasidh,Akashdeep,jaiswal @mdsirajofficial…
— Sourav Ganguly (@SGanguly99) August 4, 2025
ఓవల్ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ ఇండియా 224, రెండో ఇన్నింగ్స్‌లో 396 రన్స్ చేసింది. ఇక ఇంగ్లండ్ తన ఫస్టింగ్స్లో 247 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 367 రన్స్ చేసింది.