సింగపూర్: డ్రాల పర్వం కొనసాగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో శనివారం పదో గేమ్‌లో సైతం అదే ఫలి తం నమోదైంది. గుకేశ్, లిరెన్ మధ్య జరిగిన పదో గేమ్ కూడా డ్రా గా ముగిసింది. ఈ టోర్నీలో ఇది ఎనిమిదో డ్రా కాగా వరుసగా ఏడోది.
36 ఎత్తుల తర్వాత ఇరువురు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. ఈ టోర్నీ తొలి గేమ్‌ను లిరెన్ గెలుచుకోగా మూడో గేమ్‌ను గుకేశ్ నెగ్గాడు. ఆ తర్వాత ఇద్దరూ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నా ఫలితాలలో మాత్రం మార్పు రావడం లేదు. పదో గేమ్ ముగిసిన తర్వాత ఇరువురూ 5 పాయింట్లతో సమానంగా నిలిచారు.