కటక్: అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ మళ్లీ గెలుపు బాట పట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో యోధాస్ 38-28తో రాజస్థాన్ వారియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు ఒక ఓటమితో యోధాస్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నది.
మ్యాచ్ విషయానికొస్తే..యోధాస్ తరఫున రాహుల్ మండల్ 10 పాయింట్లతో కీలకంగా వ్యవహరించాడు. రాహుల్‌కు తోడు ప్రతీక్ వైకర్, ఆదిత్య..మ్యాట్‌పై నాలుగు నిమిషాలకు పైగా గడిపి బోనస్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. మరో మ్యాచ్‌లో ఒడిశా జాగర్నెట్స్ 31-28తో ముంబై ఖిలాడీస్పై గెలిచింది.