జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ గెలుపు జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 30-29 తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో 10 పాయింట్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.
ఆల్‌రౌండర్ భరత్ 9 పాయింట్లతో సత్తాచాటగా, విజయ్ మాలిక్(7) జట్టును ముందుండి నడిపించారు.