న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ దుమ్మురేపుతున్నది. లీగ్‌లో టైటిల్‌కు మరో రెండడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన పోరులో టైటాన్స్ 46-39తో పట్నా పైరేట్స్‌పై అద్భుత విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ భరత్ హుడా 23 పాయింట్లతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఆల్‌రౌండర్ భరత్ అన్నీతానై జట్టును ముందుకు నడిపించాడు.
ఈ క్రమంలో ఈ సీజన్లో 200 రైడ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ విజయ్ మాలిక్(5), డిఫెండర్లు అజిత్ పవార్(3), శుభం షిండే(3) కూడా రాణించారు. మరోవైపు పట్నా టీమ్‌లో స్టార్ రైడర్ అయాన్ 22 పాయింట్లతో చెలరేగినా లాభం లేకపోయింది. బుధవారం జరిగే క్వాలిఫయర్-2లో పుణెరి పల్టాన్‌తో తెలుగు టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.