పుణె: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ మళ్లీ తడబడింది. పుణె అంచెలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టైటాన్స్ 33-36 తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడింది. లీగ్‌లో ఇది వరుసగా రెండో ఓటమి కాగా, మొత్తంగా ఏడోది.
మ్యాచ్ విషయానికొస్తే..తొలి అర్ధభాగంలో టైటాన్ ఆధిక్యం కనబరిచినా..కీలకమైన ద్వితీయార్ధంలో వరుస తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. టైటాన్స్ తరఫున కెప్టెన్ విజయ్ మాలిక్(11) మరోమారు టాప్‌స్కోరర్‌గా నిలువగా, మంజిత్(7), అశిష్ నార్వల్ నాలుగేసి పాయింట్లతో రాణించినా లాభం లేకపోయింది. యోధాస్ జట్టులో గగన్ నౌడా(15) సత్తాచాటాడు.