PKL 2025 : ప్రో కబడ్డీ లీగ్ పన్నెండో సీజన్లో జోరు చూపిస్తున్న తెలుగు టైటాన్స్ (Telugu Titans) క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లింది. స్టార్ రైడర్ భరత్ హుడా (Bharat Hooda) సూపర్ -10తో రెచ్చిపోగా పటిష్టమైన పట్నా పైరేట్స్(Patna Pirates)ను 7 పాయింట్ల తేడాతో ఓడించింది. వరుసగా ఎనిమిది విజయాలతో చెలరేగిపోతున్న పైరేట్స్ జట్టును ఢిల్లీలోని త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో భరత్ చెడుగుడు ఆడుకున్నాడు.
తొలి అర్ధ భాగంలోనే ఆలౌట్ అయిన టైటాన్స్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అయితే.. పొడగరి రైడర్ అయిన అతడు ఏకంగా 23 పాయింట్లు సాధించి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ప్రత్యర్థి జట్టులో అయాన్ (22 పాయింట్లు) గొప్పగా పోరాడాడు. కానీ, డిఫెండర్లు రాణించకపోవడంతో నిష్క్రమించింది. ఫుల్టైమ్లో పూర్తయ్యే సరికి టైటాన్స్, పైరేట్స్ 46-39తో నిలిచాయి. ఫైనల్ బెర్తు కోసం జరిగే మ్యాచ్‌లో బుధవారం పుణేరి పల్టన్ (Puneri Pultan)తో టైటాన్స్ తలపడనుంది.
🔥 Telugu Titans on a mission for their first-ever PKL title! 💛
💥 They end Patna Pirates’ 8-match unbeaten run 🏴☠️
and march into Qualifier 2 🏆💪
.
.#TeluguTitans #PKL #Kabaddi #Playoffs #Kabaddi360 pic.twitter.com/VOM9qrwGTI— Kabaddi360 (@Kabaddi_360) October 28, 2025
ఈ సీజన్లో ఆది నుంచి అదరగొట్టిన దబాంగ్ ఢిల్లీ కేసీ ఫైనల్ చేరింది. క్వాలిఫయర్ 1 పోరులో స్కోర్లు సమం కాగా.. టై బ్రేకర్‌లో 6-4తో పుణేరి పల్టన్‌ను ఓడించి ఫైనల్ బెర్తు కైవసం చేసుకుంది. అక్టోబర్ 31 శుక్రవారం టైటిల్ పోరు జరుగనుంది. 2022లో పట్నా పైరేట్స్‌ను ఓడించి విజేతగా నిలిచిన ఢిల్లీ రెండో ట్రోఫీపై కన్నేసింది. అయితే.. ఢిల్లీకి చెక్ పెట్టే జట్టేదే క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఫలితంతో తేలిపోనుంది.
దుమ్మురేపిన విజయ్ మలిక్ 💥
కీలక సమయంలో ట్యాకిల్‌తో అదరగొట్టాడు 🫡
చూడండి | PKL | ELIMINATOR 3 | Telugu Titans vs Patna Pirates లైవ్
Star Sports 1 Telugu & JioHotstar లో#ProKabaddi #PKL12 pic.twitter.com/43dikyQvVh— StarSportsTelugu (@StarSportsTel) October 28, 2025
ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన పట్నా పైరేట్స్ రైడర్ అయాన్ 300 పాయింట్ల క్లబ్లో చేరాడు. పీకేఎల్ వెటరన్ పర్దీప్ నర్వాల్(పీకేఎల్ 5, పీకేఎల్ 7), పవన్ షెహ్రావత్(పీకేఎల్ 7, పీకేఎల్ 8), నవీన్ కుమార్(పీకేఎల్ 7), దేవాంక్ (పీకేఎల్11) ఒకే సీజన్లో ఈ ఘనత సాధించిన ఐదో రైడర్‌గా గుర్తింపు సాధించాడు అయాన్.