వైజాగ్ : ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్.. 45-37తో యూ ముంబాను ఓడించింది. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై దూకుడుగా ఆడిన టైటాన్స్.. మ్యాచ్‌లో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆల్‌రౌండర్ భరత్ 13 పాయింట్లతో దుమ్మురేపాడు.
చేతన్ (6), కెప్టెన్ విజయ్ మాలిక్ (5) రాణించారు. ఆడిన ఐదు మ్యాచ్‌లలో టైటాన్స్‌కు ఇది మూడో విజయం కాగా ముంబాకు రెండో ఓటమి. వరుసగా నాలుగో విజయాలతో దబాంగ్ ఢిల్లీ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ విజయంతో టైటాన్స్ 6 పాయింట్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చింది.