ముంబై : ఈ యేడాది జూన్ 8-25 తేదీలలో నిర్వహించనున్న తొలి ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్(పీహెరచ్ఎల్)లో తెలుగు టాలన్స్ కొత్తగా ప్రవేశించింది. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించే ఈ జట్టుకు ప్రముఖ క్రీడారంగ పారిశ్రామికవేత్త అభిషేక్‌రెడ్డి కంకణాల యజమాని. తెలుగు టాలన్స్తోపాటు ఢిల్లీ పాంజర్స్కూడా ఈ లీగ్‌లో చేరింది. ఢిల్లీ జట్టుకు భండారి స్పోర్ట్స్‌కు చెందిన వినీత్ భండారి యజమాని. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోల్డెన్ ఈగల్స్, గుజరాత్‌కు చెందిన గవ్రిత్ ఇంతకుముందే లీగ్‌లో చేరాయి. లీగ్‌కు సంబంధించి ఆదివారం వేలం నిర్వహించనున్నారు. మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.