హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జరుగుతున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మహిళల 400మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో వ్రితి 4:32:24సెకన్ల టైమింగ్తో రజత పతకంతో మెరిసింది.
ఇదే విభాగంలో భవ్య సచ్దేవా (4:31:69సె), అశ్మిత చంద్ర (4:34:06సె, జైన్ యూనివర్సిటీ) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన వ్రితి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగింది.