హైదరాబాద్, ఆట ప్రతినిధి: డామన్ డయ్యూ వేదికగా జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్(ఎస్జీఎఫ్) టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ఆరుశ్రెడ్డి కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన బాలుర అండర్-17 విభాగం కాంస్య పోరులో ఆరుశ్ 3-0తో అజిన్సు భండారీ(పశ్చిమబెంగాల్)పై అలవోక విజయం సాధించాడు.
అంతకుముందు జరిగిన సెమీస్లో దేబరాజ్ భట్టచార్జీ(పశ్చిమబెంగాల్) చేతిలో ఆరుశ్ ఓటమిపాలయ్యాడు.