హైదరాబాద్, ఆట ప్రతినిధి: పవర్ లిఫ్టింగ్ ఓపెన్ ప్రపంచకప్‌లో తెలంగాణకు చెందిన అర్షియా తరనుమ్ మూడు స్వర్ణాలతో మెరిసింది. కిర్గిస్థాన్ వేదికగా జరిగిన టోర్నీలో మాస్టర్స్-1 (40 సంవత్సరాలు) విభాగంలో బరిలోకి దిగిన తరునుమ్ అద్వితీయ ప్రదర్శన కనబర్చింది.
మహిళల 60 కేజీల ఈవెంట్లో ఫుల్ పవర్ లిఫ్టింగ్‌లో 232.5 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచిన తరనుమ్.. బెంచ్, డెడ్లిఫ్ట్లోనూ దుమ్మురేపి పసిడి పతకాలు కైవసం చేసుకుంది.