హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ ఆటగాడు ఆదిరెడ్డి అర్జున్ విజేతగా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన అండర్-19 టోర్నీలో 13 ఏండ్ల అర్జున్ 10 పాయింట్లు సాధించి అగ్రస్థానం దక్కించుకున్నాడు.
మొత్తం 11 రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో అర్జున్ ఇద్దరు ఇంటర్నేషనల్ మాస్టర్స్‌పై విజయాలు సాధించడం విశేషం.