హైదరాబాద్, ఆట ప్రతినిధి: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో తెలంగాణ యువ షట్లర్ తరుణ్ సత్తాచాటాడు. పుణే వేదికగా జరిగిన టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబర్చిన తరుణ్ ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో 18-21, 20-22 తేడాతో రఘు చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన తరుణ్ అంతకుముందు సెమీఫైనల్లో తరుణ్ 21-19, 6-21, 21-18తో సౌరభ్ వర్మపై, క్వార్టర్స్‌లో 21-7, 21-18తో శుభంకర్ డేపై విజయాలు సాధించాడు.