హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్కేటర్లు పతక జోరు కనబరిచారు. గుర్గావ్ వేదికగా మంగళవారంతో ముగిసిన టోర్నీలో రాష్ర్టానికి చెందిన స్కేటర్లు ఏడు పతకాలతో మెరిశారు.
ఆసాంతం అద్భుత ప్రదర్శనతో మన ప్లేయర్లు 4 స్వర్ణాలు సహా రజతం, 2 కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఇందులో ధృవ్అశి (అండర్-17), కీర్తిరాజ్సింగ్ (అండర్-10), ప్రణవ్ (అండర్-15), నైనాశ్రీ (అండర్-15) పసిడి పతకాలు దక్కించుకున్నారు. గీతిక (అండర్-13) రజతం ఖాతాలో వేసుకోగా, విష్ణువర్ధన్ (అండర్-17), ఇషితా శ్రీ (అండర్-10) కాంస్యాలు గెలిచారు.