హైదరాబాద్, ఆట ప్రతినిధి: నారాయణపూర్(చత్తీస్‌గఢ్) వేదికగా జరుగుతున్న 30వ రాజమాత జీజాబాయి సీనియర్ మహిళల ఫుట్‌బాల్ టోర్నీలో తెలంగాణ దుమ్మురేపింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 8-1 తేడాతో ఆంధ్రప్రదేశ్‌పై ఘన విజయం సాధించింది.
తెలంగాణ తరఫున రంజిత(36ని, 40ని, 51ని, 60ని) ఏకంగా నాలుగు గోల్స్‌తో విజృంభించగా, కెప్టెన్ గుగులోతు సౌమ్య(6ని, 25ని), సోనీ(21ని, 67ని) డబుల్ గోల్స్ చేశారు.