హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు వేదికైన బర్మింగ్‌హామ్‌కు తెలంగాణ బృందం బయల్దేరి వెళుతున్నది. మెగాటోర్నీ నిర్వహణ, అక్కడి క్రీడా వసతులపై అధ్యాయనం చేసేందుకు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి ఇంగ్లండ్‌కు పయనమవుతోంది. ఈ ముగ్గురు సభ్యుల బృందం మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా బర్మింగ్‌హామ్ చేరుకుంటుంది. గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి, రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.