హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ శివానీ కర్రా పసిడి పతక జోరు కనబరిచింది. శుక్రవారం జరిగిన బాలికల 100మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో బరిలోకి దిగిన శివానీ 1:12:88సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకాన్ని దక్కించుకుంది. రితికా గోకుల్(కర్ణాటక), వేదశ్రీ(ఏపీ) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
అదే జోరు కనబరుస్తూ బాలికల 200 మీటర్ల మెడ్లె ఈవెంట్లో శివానీ 2:44:08సెకన్ల టైమింగ్‌తో మరో పసిడిని ఖాతాలో వేసుకుంది. ఇదే కేటగిరీలో పోటీకి దిగిన లాస్యశ్రీ(ఏపీ), సుమన్‌వి(కర్ణాటక) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే బాలికల 400మీటర్ల ఫ్రీ స్టయిల్ ఈవెంట్లో శ్రీనిత్య 4:57:66సెకన్లతో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఓవరాల్‌గా సౌత్‌జోన్ అక్వాటిక్ టోర్నీలో తెలంగాణ స్విమ్మర్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు.