కాచిగూడ: అంతర్జాతీయ అండర్ వాటర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ గంధం క్వీన్ విక్టోరియా రజత పతకం కైవసం చేసుకుంది. ఈజిప్ట్ రాజధాని కైరో వేదికగా జరిగిన స్విమ్మింగ్ చాంపియన్షిప్ మహిళల 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగిన విక్టోరియా రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ చేజిక్కించుకుంది.
హైదరాబాద్లోని బర్కత్పురకు చెంది న క్వీన్ విక్టోరియా.. ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొ ని పతకాలు సాధించింది.