హైదరాబాద్, ఆట ప్రతినిధి: చండీగఢ్ వేదికగా జరిగిన 61వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన రాధే లోయ రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన బాలికల అండర్-14 రోలర్ ఫ్రీ స్టయిల్ స్కేటింగ్ ఈవెంట్లో రాధే రెండో స్థానంలో నిలిచింది.
ఇదే విభాగంలో యశస్వి(కర్ణాటక), వైభవి(తమిళనాడు) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. రాధే లోయ ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో జితేంద్ర గుప్తా దగ్గర శిక్షణ తీసుకుంటున్నది.