సిటీ బ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా తమ ఇండ్లను కూల్చేందుకు అనుమతులు ఇవ్వొద్దని మధుపార్క్ రిడ్జ్, హైదర్షా కోట్‌లోని ప్రభావిత కాలనీల బాధితులు పర్యావరణ ప్రభావఅంచనా అథారిటీ(ఎస్‌ఈఏసీ) చైర్మన్ రాంగోపాల్‌రెడ్డిని కోరారు. గురువారం ఆయనను కార్యాలయంలో కలిసి 100 మందికిపైగా సంతకాలు చేసిన వినతిపత్రం అందించారు. బాధితులు మాట్లాడుతూ..
మూసీ పరీవాహక ప్రాంతంలోని వృక్షాలు, వారసత్వ కట్టడాలు, నదీ పరీవాహకాన్ని విధ్వంసం చేసేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని, పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విచారణ జరిపిన తర్వాతనే పర్యావరణ అనుమతులపై ఆలోచించాలని కోరారు.నిబంధనల ప్రకారం కాకుండా ఎంఆర్డీసీఎల్కు అనుకూలంగా మార్చి తమ ఇండ్లు, భూములను బఫర్‌జోన్‌లో చేర్చారని ఆరోపించారు. సీఏఆర్ఆర్ఎస్ఐఆర్డీ అసోసియేషన్ విశాలాక్షిణి, మధుపార్క్రిడ్జ్, హైదర్షాకోట్ కాలనీ బాధితులు పాల్గొన్నారు.