హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్ రోయింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్ హేమలత రజత పతకంతో మెరిసింది. హుసేన్సాగర్ వేదికగా శనివారం జరిగిన బాలికల సింగిల్స్ స్కల్ ఈవెంట్లో హేమలత 4ని.47.9 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. మోనిక (4ని.36.8 సె.), ప్రియ (4ని.58.9 సె.) వరుసగా స్వర్ణ, కాంస్యాలు చేజిక్కించుకున్నారు. టీమ్ ఈవెంట్లో తెలంగాణ బాలికల జట్టు రజత పతకం కైవసం చేసుకుంది. ఓవరాల్గా ఈ చాంపియన్షిప్లో రాష్ట్ర సెయిలర్లు 5 పతకాలు (2 రజతాలు, 3 కాంస్యాలు) సాధించారు.