హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ వేదికగా జరుగనున్న సంతోష్ ట్రోఫీ కోసం తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ)గురువారం జట్టును ప్రకటించింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు జరిగే టోర్నీ కోసం 22మందితో రాష్ట్ర టీమ్‌ను ఎంపిక చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి 57 ఏండ్ల తర్వాత తొలిసారి హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. లీగ్ మ్యాచ్‌లు శ్రీనిధి దక్కన్ ఎరీనాలో, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది.
తెలంగాణ ఫుట్‌బాల్ టీమ్: ఇషాన్ సర్కార్, ఫయాజ్, రాజా దేబ్నాథ్, మినాల్, ఆర్నాల్డ్ సింగ్, క్రిస్, షేక్ ఉమైర్, జబైర్, కేహాన్, అభిషేక్, ఖప్, శ్రీకాంత్, సాయి, సైఫ్, తజమ్ముల్, వికాస్, ఇంతియాజ్, సైఫ్ అన్సారీ, శశాంక్, కిశోర్, రిజ్వి, అమన్.