హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీనియర్ నేషనల్ వుషూ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్ షేక్ అమన్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. శ్రీనగర్ వేదికగా జరిగిన టోర్నీలో అమన్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. తౌలూ విభాగంలో బరిలోకి దిగిన అమన్ ప్రత్యర్థిలను చిత్తు చేస్తూ ఫైనల్ చేరినా.. తుది మెట్టుపై తడబడి రెండో స్థానంలో నిలిచాడు.