మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 14: జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఫాస్ట్-5 సీనియర్ మహిళల, పురుషుల నెట్‌బాల్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పురుషుల విభాగంలో తెలంగాణ టీమ్ 21-5తో ఉత్తరాఖండ్‌పై గెలువగా, తెలంగాణ మహిళల జట్టు 30-5తో బెంగాల్‌పై గెలిచి శుభారంభం చేశాయి.
పురుషుల కేటగిరీలో కేరళ 32-12తో తమిళనాడుపై, చత్తీస్‌గఢ్ 25-22తో బీహర్‌పై, కర్ణాటక 31-14తో మహరాష్ట్రపై, గోవా 27-15తో పుదుచ్చేరిపై, ఉత్తరప్రదేశ్ 30-13తో మధ్యప్రదేశ్‌పై, హర్యానా 44-22తో ఆంధ్రప్రదేశ్‌పై, జమ్ముకశ్మీర్ 24-10తో తమిళనాడుపై, ఆంధ్రప్రదేశ్ 28-14తో బెంగాల్‌పై గెలిచాయి. మహిళల కేటగిరీలో తమిళనాడు 25-18తో పుదుచ్చేరిపై, కర్ణాటక 20-12తో మహరాష్ట్రపై, బీహర్ 29-11తో ఏపీపై, ఢిల్లీ 14-10తో రాజస్థాన్‌పై, హిమాచల్‌ప్రదేశ్ 22-16తో బీహర్‌పై, పంజాబ్ 19-14తో యూపీపై, కేరళ 31-5తో మధ్యప్రదేశ్‌పై, రాజస్థాన్ 22-21తో తమిళనాడుపై గెలిచాయి.