మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 16: నేషనల్ ఫాస్ట్-5 నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీల ఫైనల్లో హర్యానా 32-20 తేడాతో తెలంగాణ జట్టుపై గెలిచి ట్రోఫీ చేజిక్కించుకుంది. మహిళల విభాగంలో హర్యానా 43-23తో కర్ణాటకపై గెలిచింది. పురుషుల విభాగంలో ఢిల్లీ, మహిళల విభాగంలో తెలంగాణ మూడో స్థానం దక్కించుకున్నాయి. పోటీల అనంతరం విజేతలకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ విజేందర్‌సింగ్, టోర్నీ చైర్మన్ అమిత్ అరోరా, కన్వీనర్ అకాశ్బాత్ర, అశోక్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.