కొల్లాపూర్, సెప్టెంబర్ 20 : ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) వేదికగా జరుగుతున్న 10వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ అథ్లెట్ గడ్డం రాజేశ్వరి పసిడి ధమాకా కొనసాగిస్తున్నది. టోర్నీలో ఇప్పటికే 5కిలోమీటర్ల రేస్ వాక్(19నిమిషాల 55 సెకన్లు)లో స్వర్ణం కొల్లగొట్టిన రాజేశ్వరి మళ్లీ సత్తాచాటింది. శుక్రవారం జరిగిన బాలికల అండర్-20..3వేల స్టిపుల్చేజ్ రేసును 12 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేసిన ఈ అమ్మాయి మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామానికి చెందిన రాజేశ్వరి విజయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.