హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ఎనిమిదవ తెలంగాణ అంతర్ జిల్లాల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో బాసా సూర్యాంశు మూడు స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు. తనకు తిరుగులేదన్న రీతిలో బరిలోకి దిగిన సూర్యాంశ్.. 50మీటర్ల బటర్ైఫ్లై (00.26.80సె), 50మీ ఫ్రీస్టయిల్ (00.25.32సె), 50మీ బ్రెస్ట్‌స్ట్రోక్ (00.32.56సె) విభాగాల్లో మూడు స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు. సూర్యాంశు ప్రస్తుతం సాట్స్ కోచ్ ఆయూశ్ యాదవ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు.